నేటిసూర్య ప్రతినిధి1:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చర్ల లోని BRS పార్టీ కార్యాలయంలో యూత్ అధ్యక్షుడు కాకి అనిల్ , డివిజన్ సమన్వయ కమిట్ సభ్యులు దొడ్డి తాతారావుల ఆధ్వర్యంలోకోట్ల మంది ప్రజల గుండెల్లో ఉద్యమ స్ఫూర్తి రగిలించిన మలి దశ తెలంగాణ ఉద్యమ సిద్ధాంత కర్త శ్రీ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక భుమిక పోషించడంతో పాటు కొట్లది ప్రజల గొంతుకగా తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించారు. అని అట్టి మహనీయుని జయంతి సందర్భంగా మరొకసారి వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది అని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో SC సెల్ నాయకులు తోటమల్ల రవి కుమార్ ,కొంభత్తిని రాము, లింగాపురం గ్రామకమిటీ అధ్యక్షులు సిద్ది రాజు, మండల యూత్ నాయకులు తడికల బుల్లెబాయి, వేల్పుల సమ్మయ్య, అంబోజీ సతీష్, ఎన్నమూరి సృజన్, తడికల చందు, కొంగురి సోమరాజు, గంపల రమేష్, కార్యకర్తలు పాల్గొన్నారు