పాయం సత్యనారాయణ.
చర్ల, సూర్య న్యూస్:
ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ప్రపంచం మొత్తం చాటే విధంగా ఆదివాసి ప్రజానీకం ఘనంగా నిర్వహించాలని పాయం సత్యనారాయణ పిలుపునిచ్చారు. చర్ల మండలంలొని లక్ష్మి కాలనీలో మంగళవారం తోలే లక్ష్మీ అధ్యక్షతన జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో గోండ్వానా సంక్షేమ పరిషత్తు రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారా యణ మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా 70 దేశాల్లో 30 కోట్ల మంది ఆదివాసీలు ఉన్నట్లు అంచనా లు ఉన్నాయని భారత దేశంలో పాలకుల విధానాల వల్ల ఆదివాసీల పరిస్థితి మనుగడ కోల్పోయి దేశవ్యాప్తంగా ఇప్పటికే 85 ఆదివాసి తెగలు అంతరిం చిపోయినట్లు నివేదికలు తెలుపు తున్నాయని అన్నారు.ఆదివాసి ప్రాంతాల్లో స్వయం పాలిత ఆటానామస్ కౌన్సిల్ను ప్రకటించి దేశవ్యాప్తంగా ఆదివాసి ప్రాంతాల జిల్లాలో స్వయం పాలన కౌన్సిల్స్ వ్యవస్థను ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్లు మరియు జిల్లా ఎస్పీలు ఆదివాసిల కౌన్సిల్ తీర్మానాలను అమలు చేసే విధంగా పాలనాపరమైన వ్యవస్థను రూపొందించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.ఆరవ షెడ్యూల్ ప్రాంతాల కౌన్సిల్గా దేశంలోని ఐదవ షెడ్యూల్ పరిధిలో ఉన్న 10 రాష్ట్రాలలో కూడా ఆదివాసుల స్వయం పాలన కోసం అటానమస్ కౌన్సిల్ను ప్రకటించాలిభారతదేశంలో గోండ్వానా భూభాగం ప్రాంతంలో ఉన్న 10 కోట్ల జనాభా ఆదివాసులు ఉన్నారని 14వ శతాబ్దం నుండి 18 శతాబ్దం వరకు గోండ్వానా రాజ్యాలు బ్రహ్మాండంగా విలసిల్లాయని అన్నారుఆదివాసి జాతులకు మాత్రమే vy జాతీయస్థాయిలో రిజర్వేషన్లు అమలు చేయాలని ఈ సందర్భంగా కోరారు ఈ యొక్క కార్యక్రమంలో మహిళా మండలి నాయకులు సోడి లక్ష్మీ, పునేమ్ శాంత, తాటి సమ్మక్క, వేల్పుల అనిత, పాయం స్వరూప, వాసం పార్వతి, పుణెము లక్ష్మీ, పునెం బయమ్మ, పునెం రమణ తదితరులు పాల్గొన్నారు.