Saturday, September 14, 2024

డ్రైనేజీల్లో నీరు నిలవకుండా చూడాల్సిన బాధ్యత పంచాయతీలదే. డిఎల్పిఓ సుధీర్ కుమార్

నేటిసూర్య ప్రతినిధి: స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమాన్ని పకడ్బందీగా అన్ని గ్రామపంచాయతీలో నిర్వహించాలని డిఎల్పిఓ సుధీర్ కుమార్ పంచాయతీ అధికారులు ఆదేశించారు. బుధవారం పినపాక మండలంలో ఆయన ఆకస్మికంగా పర్యటించి సీతంపేట, భూపాలపట్నం, ఈ బయ్యారం, ఉప్పాక, సీతారాంపురం గ్రామపంచాయతీలో జరుగుతున్న స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమాలను పరిశీలించారు. డ్రైనేజీలలో నీరు నిలవకుండా చూడాల్సిన బాధ్యత గ్రామపంచాయతీ సిబ్బందిపై ఉందన్నారు. పినపాక ప్రధాన రహదారి పక్కన ప్రవహిస్తున్న అలుగులో చెత్త చేరి నీరు ఆగడంతో వెంటనే జెసిబి సహాయంతో ఆ చెత్తను తొలగించి వరద నీరు పోయేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం ఈ బయ్యారం వద్ద పెద్దవాగు ప్రవాహాన్ని పరిశీలించారు. గ్రామపంచాయతీల్లో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను కచ్చితంగా పాటించాలని తెలిపారు. సీతంపేట గ్రామపంచాయతీలో నీరు నిలిచి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని స్థానికులు తెలపడంతో వెంటనే రోడ్డు ఇరువైపులా 5 అడుగుల మేర కచ్చా డ్రైన్ తీయాలని స్థానిక ఎంపీఓ వెంకటేశ్వరరావును ఆదేశించారు.డీపీఓ ఆదేశాల మేరకు ఎంపీ ఓ తక్షణమే జెసిబి సహాయంతో రోడ్డుకి ఇరువైపులా కచ్చ డ్రైన్ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రామకృష్ణ, ఎంపీఓ వెంకటేశ్వరరావు, సెక్రటరీలు జైపాల్ రెడ్డి, జ్యోతి, చంద్రకుమార్, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular