ప్రభుత్వం త్వరితగతిన అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వాలి .
చర్ల మండలం లో కాలిగా ఉన్నా 13 అంగన్వాడీ పోస్టులను భర్తీ చెయ్యాలి .
చర్ల ఐసిడిఎస్ కార్యాలయం అధికారికి వినతి పత్రం అందజేత.
ఐఎఫ్ టియు భద్రాచలం డివిజన్ నాయకుడు కొండా చరణ్.
చర్ల , నేటిసూర్య న్యూస్:
చర్ల మండలంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ఐఎఫ్టియు ఆధ్వర్యంలో చర్ల సిడిపిఓ కార్యాలయంలోనిది గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఐఎఫ్టియు డివిజన్ నాయకుడు కొండ చరణ్ మాట్లాడుతూ చర్ల మండలంలో కొండేవాయి బూర్గుపాడు కొరకట్పాడు ఆర్సిపురం కిష్టారం పాడు గొంపల్లి 1 రామాంజపురం జిపి పల్లి ఉప్పరగూడెం కొయ్యూరు ఆర్ కొత్తగూడెం ఒకటి కుదునురు ఒకటి పొడప గుంపు ఇలా 13 అంగన్వాడీ కేంద్రాలలో టీచర్లు లేరని అన్నారు దీని కారణంగా పిల్లలు తల్లులు గర్భిణీ స్త్రీలు బాలింతలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు ఎలాగైనా పౌష్టికాహారం అందించాలని ఆలోచనతో మండల సంబంధిత అధికారులు ఎక్కడైతే టీచర్స్ లేరు ఆ అంగన్వాడి సమీపంలో ఉన్న మరొక అంగన్వాడి సెంటర్ కు పిల్లలను తల్లులను గర్భిణి స్త్రీలను బాలింతలను పంపించడం జరుగుతుంది దాని కారణంగా ఇప్పటికే నానా ఇబ్బందులు పడుతూ సెంటర్ ను నడుపుతున్న అంగన్వాడీ టీచర్లకు వర్కర్లకు అదనపు పని భారం అవుతుందని అన్నారు ఇది సరైన పద్ధతి కాదు అని అన్నారు ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ వేస్తామని ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు కానీ నేటి వరకు కూడా ఆ హామీ నెరవేరలేదని అన్నారు హామీలతో సమస్యలు పరిష్కారం కావాలని తక్షణమే సమస్య యొక్క తీవ్రతను అర్థం చేసుకొని ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు లేనియెడల ఈ సమస్యపై ఉద్యమిస్తామని హెచ్చరించారు అనంతరం కార్యాలయంలో అందుబాటులో ఉన్న అధికారికి వినతిపత్రం అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు మండల నాయకులు పురిటి ప్రశాంత్, కిషోర్, కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.