భద్రాచలం, ,నేటిసూర్య ప్రతినిధి:
భద్రాచలంలోని సుభాష్ నగర్ కాలనీకు చెందిన ఓ దివ్యాంగురాలికి వసుధ పౌండేషన్ ద్వారా మంగళవారం ఆర్ధిక సాయంను అందచేసి చేయూతనందించింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఆ కాలనీకు చెందిన బానోత్ సుభద్రకు భర్త మరణించగా ఉన్న ఒక్క కుమార్తె దివ్యాంగురాలు, సుభద్రకు గుండెజబ్బుతో పాటు వెన్నుపూసకు దెబ్బ తినటంతో ఇంటిగడవని స్థితిలో ఉంది. అదేవిధంగా దివ్యాంగురాలైన కుమార్తెకు సైతం ఆరోగ్యం బాగోలేదు. ఇటీవల భద్రాచలంకు చెందిన చేతనా మీ సేవా నిర్వహకులు రంజిత్‌నాయక్ ఇటీవల నిత్యవసర సరుకులు, ఆర్ధిక సాయం అందచేశారు. వసుధ పౌండేషన్ డివిజన్ భాద్యులు వేఘ్నేశ్న శ్రీనివాస రాజుకు ఆ కుటుంబం పరిస్థితిని వివరించారు. ఆయన పౌండేషన్ ఛైర్మన్ మంథెన వెంకటరామరాజు దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించిన ఛైర్మన్ సంస్థ తరుపున ఆర్ధిక సాయం విడుదల చేశారు. మంగళవారం రూ.10వేలను దివ్యాంగురాలికి అందచేయగా వారు పౌండేషన్ ఛైర్మన్. మంథెన వెంకటరామరాజు, బాధ్యులు వేఘ్నేశ్న శ్రీనివాస రాజు సమాచారం అందచేసిన చేతన మీ సేవ నిర్వహకులు భూక్యా రంజిత్ నాయక్‌కు కృతజ్ణతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పౌండేషన్ సభ్యులు పివి సత్యనారాయణ, క్లాసిక్ షరిప్, రంజిత్ నాయక్, బీఆర్‌ఎస్ నాయకురాలు సీతామహాలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.