భద్రాచలం, నేటి సూర్య న్యూస్: ఈ నెల 30న భద్రాచలం ఐటిడిఏ ధర్నా చౌక్ ఎదుట జరిగే రిలే దీక్షలను ఆదివాసులు అందరూ తరలివచ్చి జయప్రదం చేయాలని పాయం సత్యనారా యణ పిలుపునిచ్చారు. చర్ల మండలం , పెద్ది పెల్లి గ్రామంలో సోయం శుక్రరామ్ అధ్యక్షతన సోమవారం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి గోండ్వానా సంక్షేమ పరిషత్తు రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు. భద్రాచలం లో ఉన్న సమస్యలను అధికారులు త్వరత గతిన పరిష్కరించాలని అడుగు తున్నాము తప్పా వేరే కొత్త సమస్యలు పరిష్కరించాలని మేము అడగడం లేదని అధికారులను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నము అనిఅన్నారు.
షెడ్యూలు ప్రాంత హక్కుల పరిరక్షణకు జిల్లా స్థాయి నుండి మండల స్థాయి అన్ని శాఖల అధికారులు ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదని ఆరోపించారు
హైడ్రా కన్నా పవర్ ఫుల్ ఒకటి బై 70 చట్టం ఏజెన్సీలో కొనసాగుతునా ఆ దిశగా అధికారులు ఎందుకు ముందుకు పోవడం లేదని ప్రశ్నించారు .
షెడ్యూలు ప్రాంతాలలో వలస గిరిజనేతరులు దర్జాగా సర్వ్ నెంబర్50/3,50/4,50,5, గ్రామ కంఠంలో ప్రముఖ వైద్యుడు ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని అనుభవిస్తూ చట్ట ఉల్లంఘనకు పాల్పడుతూ చట్టాన్ని నిర్వీర్యం చేస్తుంటే గడిచిన 40 ఏళ్ల కాలంలో గిరిజన చట్టాన్ని రూపురేఖలు లేకుండా చేస్తున్న సంబంధిత రెవెన్యూ అధికారులు మరియు పంచాయతీ అధికారులపై ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఘాటుగా ప్రశ్నించారు దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమ్ కావాలంటే ఈ నెల 30న జరిగే రిలే దీక్షలను ఆదివాసులు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ యొక్క సమావేశంలో సోడి పాండు నాగేశ్వరరావు కనితి రాంబాబు లక్ష్మయ్య ప్రవీణ్ సమ్మయ్య. తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు
భద్రాచలం ఐటిడిఏ ధర్నా చౌక్ ఎదుట రిలే దీక్షలు. పాయం.
RELATED ARTICLES