గిరిజన గ్రామాల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలి.
విష జ్వరాలు ప్రబలకుండా చర్యలు చేపట్టాలి.
అన్ని పీ.హెచ్.సి లలో వైద్యులు ఉండేలా చర్యలు తీసుకోవాలి.
అన్ని గ్రామాల్లో పారిశుధ్యం పనులు చేపట్టాలి.
సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు.
భద్రాచలం, నేటిసూర్య న్యూస్:
గత వారం రోజుల కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం ఏజెన్సీ లోని అనేక గ్రామాలలో విష జ్వరాలతోటి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని తక్షణమే భద్రాచలం ఏజెన్సీలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని, గిరిజన గ్రామాల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, విష జ్వరాలు ప్రబలకుండా తగు చర్యలు చేపట్టాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం భద్రాచలం పట్టణ కమిటీ సమావేశం ఎం.బీ.నర్సారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మచ్చ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భద్రాచలం ఏజెన్సీ వ్యాప్తంగా గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు, వరదలకు విష జ్వరాలతో ఇంటికో మనిషి మంచాన పడ్డారని డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ మొదలగు విష జ్వరాలు ప్రబలుతున్నాయని అన్నారు. భద్రాచలం కేంద్రంగా ఉన్న ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ తో పాటు భద్రాచలం ఏజెన్సీలోని అన్ని పీ.హెచ్.సి లలో డాక్టర్లు ఉండేలా చూడాలని, అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో విష జ్వరాలకు సంబంధించిన అన్ని రకాల రక్తపరీక్షలు నిర్వహించాలని అన్నారు. కురుస్తున్న భారీ వర్షాలకు అనేక గ్రామాలు వరద ముంపుకు గురవుతున్నాయని ఈ నేపథ్యంలో గ్రామపంచాయతీల ద్వారా ప్రత్యేకంగా పారిశుద్ధ్య పనులు చేపట్టాలని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు బండారు శరత్ బాబు, సున్నం గంగా, వై వెంకట రామారావు, పి సంతోష్ కుమార్, నాదెళ్ల లీలావతి, పట్టణ కమిటీ సభ్యులు డి సీతాలక్ష్మి, ఎన్ .నాగరాజు, యు జ్యోతి, కుంజా.శ్రీనివాస్ జీవనజ్యోతి ,సిహెచ్. మాధవరావు, భూపేంద్ర, కోరాడ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు..