సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలి.
బీజేపీ జిల్లా అధ్యక్షులు కేవీ రంగా కిరణ్.
చర్ల , నేటి సూర్య న్యూస్:
మండలం లో బూత్ స్థాయి లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు కేవీ రంగా కిరణ్ అన్నారు. శుక్రవారం చర్ల మండల కేంద్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమ మండల కన్వీనర్ నల్లూరి ఉదయ్ భాస్కర్ అధ్యక్షతన జరిగిన సభ్యత్వ నమోదు అవగాహన సదస్సులో ముఖ్య అతిధిగా రంగా కిరణ్ పాల్గొని మాట్లాడారు. ప్రపంచం లోనే అత్యధిక సభ్యత్వాలు కలిగిన అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ అని, బూతు స్థాయి లో అత్యధిక సభ్యత్వాలు నమో దు చేసి మరోసారి మన రికార్డ్ మనమే అధిగమించాలని, ఇది మనందరిపై భాద్యత ఉందని అన్నారు. అనంతరం సభ్యత్వం చేసే విధానం పై సభ్యత్వ నమోదు జిల్లా కన్వీనర్ పోనిశెట్టి వెనకటేశ్వర్లు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం లో స్టేట్ కౌన్సిల్ మెంబర్ కుంజా ధర్మా రావు, అసెంబ్లీ కన్వీనర్ త్రినాధ రావు, ఓబీసీ జిల్లా అధ్యక్షులు బిట్రగుంట క్రాంతి కుమార్,జిల్లా కార్యదర్శి బిజ్జం శ్రీనివాస్ రెడ్డి,
మండల కో కన్వీనర్లు ఎడవల్లి శేషగిరి రావు,నూపా రమేష్, గుమ్మల వేణు, అలెం సమ్మయ్య, చుక్క శివ, పినపాక మండల అధ్యక్షులు శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.