భద్రాచలం, నేటి సూర్య న్యూస్1:
చర్ల ప్రధాన రహదారి వెంట గ్రీన్ భద్రాద్రి సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం మొక్కలు నాటడం నిర్వహించారు. గ్రీన్ భద్రాద్రి అధ్యక్షులు ఉమా శంకర్ నాయుడు మాట్లాడుతూ, గత 12 సంవత్సరాలనుండి గ్రీన్ భద్రాద్రి సంస్థ పట్టణ ప్రముఖులు, దాతల సహకారంతో భద్రాచలం పట్టణంలోని అన్ని కాలనీలలో, రహదారుల వెంట వేలాది మొక్కలు నాటి, సంరక్షించి పెద్ద వృక్షాలుగా మార్చామని, భద్రాచలం పట్టణాన్ని పచ్చని భద్రాద్రి గా చేయడమే తమ లక్ష్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ భద్రాద్రి అధ్యక్షులు ఎ. ఉమాశంకర్ నాయుడు, కార్యదర్శి పామరాజు తిరుమలరావు, జాయింట్ సెక్రటరీ పూసం రవికుమారి, మాజీ అధ్యక్షులు బోనాల సూర్యనారాయణ, బెల్లంకొండ రాంబాబు, మహిళా కార్యదర్శి తుమ్మల రాణి తదితరులు పాల్గొన్నారు .