బూర్గంపాడు , నేటి సూర్య న్యూస్:
బూర్గంపాడు మండలం సారపాక గ్రామపంచాయతీ పరిధిలో గాంధీనగర్ లో పోషణ మాసం సందర్భంగా శుక్రవారం శ్రీమంతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దుగ్గెంపూడి కృష్ణారెడ్డి హాజర య్యారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ గర్భిణీ స్త్రీలకు పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలని అవగాహన కల్పించారు .గర్భిణీ స్త్రీలకు బ్రెడ్ ప్యాకెట్స్ అందజేశారు .స్కూల్ టీచర్ పద్మజ కిశోర బాలికలకు ఎనీమియా వ్యాధి రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించారు ప్రతి నెల అంగనవాడిలో బరువులు తీయించుకోవాలని ఏ సబ్ సెంటర్లలో చెక్ అప్స్ చేయించాలని తల్లులకు అవగాహన కల్పించారు.ఇందులో భాగంగా ఏఎన్ఎం ఉమాదేవి రక్తహీనత లేకుండా ఉండాలని గవర్నమెంట్ హాస్పటల్లో డెలివరీలు చేయించుకోవాలని పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలని గర్భిణి స్త్రీలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఐజిడి సంస్థ వాళ్లు భరత్,అభిషేక్,స్రవంతి వాళ్ల గర్భిణీ స్త్రీలకు శారలతో సత్కరించటం జరిగింది ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్ శ్రీనివాస్ అంగన్వాడీ టీచర్స్ ఎం ఈశ్వరి,బి రచన,ఎం రమాదేవి,తార ఆశా వర్కర్ గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాటం వెంకటరామిరెడ్డి, ప్రభాకర్, చిరంజీవి,లాలయ్య,రఘు, శంకర్ పాల్గొన్నారు