మృతుల్లో నలుగురు చిన్నారులు
నేటి సూర్య న్యూస్: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని రాజ్నందగావ్ జిల్లా సోమ్ని పోలీసు స్టేషన్ పరిధిలోని జోరట్ రాయ్ గ్రామంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అదే సమయంలో పిడుగు పడి 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతులను శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లుచేసారు.